»Upi New Rule On Payments 4 Hours To Send Rs 2 Thousand
UPI: పేమెంట్లపై కొత్త రూల్..రూ.2 వేలు పంపేందుకు 4 గంటల సమయం!
యూపీఐ పేమెంట్స్ చేసేవారికి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఈ రూల్ ప్రకారం..ఎవరైనా కొత్త వ్యక్తులకు రూ.2 వేలకుపైన ట్రాన్సాక్షన్స్ చేశాక మరో ట్రాన్సాక్షన్ అదే వ్యక్తికి చేయడానికి 4 గంటల పాటు సమయం పట్టనుంది. దీంతో డిజిటల్ పేమెంట్స్ మరింత ఆలస్యం కానున్నాయి. సైబర్ నేరాలను అరికట్టేందుకే ఈ రూల్‌ను తీసుకొస్తున్నట్లు యూపీఐ వెల్లడించింది.
యూపీఐ పేమెంట్ల (Upi Payments)పై త్వరలో కొత్త రూల్ (New Rule) రానుంది. ఈ కొత్త రూల్ అమలులోకి వస్తే ఇతర లావాదేవీలన్నీ కూడా మరింత ఆలస్యం కానున్నాయి. మొదటి ట్రాన్సాక్షన్ రూ.2 వేలకు మించి చేసినట్లయితే ఆయా లావాదేవీలు మరింత ఆలస్యం కానున్నాయి. తమ వినియోగదారుల కోసం యూపీఐ ఈ కొత్త రూల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆన్లైన్ లల్లో మోసాలను నిరోధించేందుకు ఈ ప్రయత్నం చేయనుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదటిసారి ట్రాన్సాక్షన్స్ (Transactions) జరుగుతున్నట్లు అయితే వారికి ఈ రూల్ వర్తించనుంది.
ఈ కొత్త రూల్ (New Rule) అమల్లోకి వస్తే యూజర్ రూ.2 వేల కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడానికి నాలుగు గంటల పాటు ఆలస్యం (4 hours Late) కానుంది. అంటే ఒక ట్రాన్సాక్షన్ చేశాక 4 గంటల తర్వాతే ఇంకో ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఆ ట్రాన్సాక్షన్ లో ఏదైనా పొరపాటు జరిగితే ఆయా లావాదేవీలను రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. యూపీఐ యూజర్లు చాలా మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. వారి వల్ల చాలా డబ్బులు నష్టపోతున్నారు. అందుకోసమే యూపీఐ ఈ కొత్త రూల్‌ను అమల్లోకి తీసుకురానుంది.
ఈ విధానం కొంత కష్టమైనప్పటికీ సైబర్ నేరాలను (Cyber crimes) అరికట్టడానికి ఇది తప్పక అవసరమని ప్రభుత్వ అధికారులు విశ్వసిస్తున్నారు. అందుకే యూపీఐ (UPI) ఈ సేవలను అందుబాటులోకి తీసుకుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యూపీఐ పేమెంట్స్‌లో ఇన్స్టంట్ పేమెంట్ సర్వీసు (IMPS), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)తో సహా వివిధ డిజిటల్ పేమెంట్ పద్ధతులకు ఈ రూల్‌ను వర్తించనుంది.