దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో దేశానికి, దేశంలోని ప్రతి పౌరుడి అమృత కాలమని.. ఈ సమయంలోనే దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా నిర్మించుకోవాలని అన్నారు. పరిశ్రమలను విస్తరించడం, మంచి పంటలను పండించడం వంటి కార్యక్రమాల ద్వారానే మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి దేశంలో కేవలం 3 కోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి ద్వారా నీళ్లు వచ్చేవని ఇప్పుడు 11 కోట్ల ఇళ్లకు అందుతున్నాయిని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది మే నెల లోపల ఎన్నికలు వస్తాయని చెప్పారు. కర్ణాటకలో 224 అసెబ్లీ స్థానాలు ఉండగా 150 చోట్ల విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని తెలిపారు.