»Nitish Kumar Nitish Who Rejected The Post Of Convener Of India Alliance
Nitish Kumar: INDIA కూటమి కన్వీనర్ పదవిని తిరస్కరించిన నితీశ్
బిహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఇండియా కూటమి కన్వీనర్ పదవిని తిరస్కరించినట్లు సమాచారం. కూటమిలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ నుంచే ఒకరికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని నితీశ్ అభిప్రాయపడినట్లు సమాచారం.
Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ INDIA కూటమి కన్వీనర్ పదవిని తిరస్కరించినట్లు సమాచారం. ఈ కూటమిలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ నుంచే ఒకరికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని నితీశ్ అభిప్రాయపడినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీ ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయాన్ని చర్చించేందుకు ఈరోజు INDIA కూటమి వర్చువల్ విధానంలో సమావేశమైంది. అయితే ఎక్కడ ఎవరెన్నీ స్థానాల్లో పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత రానుంది.
ఈరోజు జరిగిన కూటమికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మాయావతి హాజరు కాలేదు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆప్‌కు వరుసగా 4,7 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ ఆప్ మాత్రం ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తమకే ఎక్కువ ఎంపీ స్థానాలు కావాలని పట్టుబడుతోంది. గోవా, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో కూడా తాము పోటీ చేస్తామంటోంది. ఈక్రమంలో అయిదు రాష్ట్రాల్లో కూడా INDIA కూటమి పార్టీల్లో సీట్ల సర్దుబాటు అంత సులువు కాదని అర్థం అవుతోంది. అయితే నితీశ్ కుమార్ కన్వీనర్ పదవిపై ఆసక్తి కనబర్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు ఆ పదవిని కట్టబెట్టే ఛాన్స్ ఉందని సమాచారం.