New Power Tariff In Soon: Different Tariff At Day And Night
New Power Tariff: దేశవ్యాప్తంగా కొత్త విద్యుత్ ఛార్జీలు (New Power Tariff) అమల్లోకి రాబోతున్నాయి. పగటి పూట ఛార్జీ 20 శాతం తక్కువగా ఉండగా.. రాత్రిపూట 20 శాతం మేర పెంచనున్నారు. కొత్త పవర్ టారిఫ్‌ను (Power Tariff) కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. విద్యుత్ వాడే సమయం, పీక్ అవర్స్, డేగా విభజిస్తారు. డేలో పవర్ వినియోగం తక్కువగా ఉండటంతో తక్కువగా చార్జీ వసూల్ చేయాలని భావిస్తోంది. 10 కిలోవాట్లకు మంచి డిమాండ్ ఉన్న వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఈ ఏప్రిల్ 1వ తేదీ లోపు టైమ్ ఆఫ్ డే టారిఫ్ అమలు చేయాలని స్పష్టం చేసింది. వ్యవసాయదారులు తప్ప ఇతరులు అందరికీ ఈ నిబంధన 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తింపజేస్తారట.
సౌర విద్యుత్ ఉత్పత్తి అయ్యే పగటి సమయంలో విద్యుత్ చార్జీ తక్కువగా ఉంటాయి. దీంతో వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. సౌర శక్తి అందుబాటులో లేని రాత్రి సమయాల్లో థర్మల్, హైడ్రో, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సౌర విద్యుత్ ఉత్పత్తి కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రాత్రి విద్యుత్ చార్జీల పెంపునకు ఇదీ కారణం అంటున్నారు. 2020 నాటికి శిలజయేతర ఇంధన శక్తి సామర్థ్యం 35 శాతం చేరేందుకు ఈ విధానం సాయపడుతుంది. 2070 నాటికి సున్నా ఉద్గారాల లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారట.
డేలో పవర్ చార్జీ తక్కువగా.. రాత్రి వేళ వినియోగించే లైట్లు, ఫ్యాన్, ఏసీతో విద్యుత్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాల్లో స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ వాడకం, అకౌంట్లో బ్యాలెన్స్ రోజువారీగా చెక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారట. విద్యుత్ వినియోగదారుల హక్కులను సవరిస్తూ గురువారం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. డిస్కంలు అన్నిరకాల స్మార్ట్ మీటర్లు రోజూ కనీసం ఒక్కసారి అయినా రిమోట్ విధానంలో పరిశీలించాలి. స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్ యూజర్స్ విద్యుత్ వాడకానికి సంబంధించిన సమాచారం వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్, లేదా ఎస్ఎంఎస్ ద్వారా అందుబాటులో ఉంచాలి. వాడిన యూనిట్లు, అయిన ఖర్చు, మిగిలిన నగదును తనిఖీ చేసుకునే అవకాశం ఉంటుంది.