MP Kanimozhi Compliments After Women Driver Lost Job
MP Kanimozhi: తమిళనాడు కోయంబత్తూరులో మహిళా డ్రైవర్ షర్మిల మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె నడిపే బస్సులో ప్రముఖులు కూడా ప్రయాణిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ ట్రావెల్ చేసి.. అభినందించారు. తర్వాత ఎంపీ కనిమొళి (MP Kanimozhi) కూడా బస్సు ఎక్కారు. షర్మిలను ప్రత్యేకంగా విష్ చేశారు. ఆ తర్వాత షర్మిల (sharmila) ఉద్యోగం ఊడింది.
కోయంబత్తూరులో ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా షర్మిల (sharmila) పనిచేస్తున్నారు. సిటీలో (city) బస్సు నడుపుతున్న ఏకైక మహిళ ఈమెనే. శుక్రవారం కనిమొళి ప్రయాణించే సమయంలో ఆమెతోపాటు చాలా మంది అనుచరులు ఎక్కారు. కనిమొళి అనుచరులు టికెట్ విషయంపై కండక్టర్‌తో గొడవ జరిగింది. టికెట్ తీసుకోవాలని కండక్టర్ అడగగా.. గొడవ జరిగింది. ఆ గొడవ గురించి కండక్టర్ ట్రావెల్స్ యజమానికి తెలియజేశాడు.
ఏం జరిగిందని యజమాని (owner) ఆరా తీశాడు. కనిమొళి, ఆమె మనుషులు టికెట్ తీసుకున్నారని చెప్పారు. అదేం లేదని, టికెట్ తీసుకోలేదని.. కలెక్షన్ తగ్గిందని చెప్పారట. నువ్వు బస్సు నడుపుతోంది కేవలం ప్రచారం కోసమేనని.. అందుకే జనాలను ఎక్కించుకుంటున్నారని యజమాని షర్మిలతో (sharmila) అన్నాడు. టికెట్ తీసుకోకుంటే ఎలా అని గట్టిగా మందలించాడట. దీంతో షర్మిల నొచ్చుకుని, ఉద్యోగం మానేసింది.
విషయం తెలిసిన ఎంపీ కనిమొళి (Kanimozhi).. షర్మిలకు (sharmila) అండగా ఉంటానని తెలిపారు. ఆమెను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసాను ఇచ్చారు. షర్మిల (sharmila) డ్రైవ్ చేసే బస్సులో ప్రయాణికులే కాదు.. ప్రముఖులు ట్రావెల్ చేస్తున్నారు. వారిలో కొందరు టికెట్ తీసుకోకపోవడం గొడవకు కారణం అవుతోంది. షర్మిల అయితే టికెట్ తీసుకున్నారని చెప్పినప్పటికీ లెక్క సరిపోవడం లేదు. దీంతో ఉద్యోగం వీడాల్సి వచ్చింది.