Revenge Love story : లవర్తో లేచిపోయిన భార్య.. తన భార్యను లేపుకెళ్లిన వ్యక్తి భార్యతో పెళ్లి
ఈ కథ మొత్తం రూబీ దేవి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు నీరజ్ కు 2009 లో వివాహం జరిగింది. వాళ్లకు నలుగురు పిల్లలు. కానీ.. రూబీ దేవికి అదే గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని నీరజ్ కు ఆలస్యంగా తెలిసింది. కానీ.. అది అక్రమ సంబంధం...
Revenge Love story : టిట్ ఫర్ టాట్ అంటే తెలుసు కదా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అర్థం. ఇది మనుషులకు కూడా వర్తిస్తుంది. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్య.. తన లవర్ తో లేచిపోయింది. దీంతో తన లవర్ భార్యను ఇతడు తగులుకొని ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇది రివేంజ్ లవ్ స్టోరీ. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలోనూ దీని గురించే చర్చ. పదండి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.
అది బీహార్ లోని ఖగారియా జిల్లా. ఈ కథ మొత్తం రూబీ దేవి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు నీరజ్ కు 2009 లో వివాహం జరిగింది. వాళ్లకు నలుగురు పిల్లలు. కానీ.. రూబీ దేవికి అదే గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని నీరజ్ కు ఆలస్యంగా తెలిసింది. కానీ.. అది అక్రమ సంబంధం మాత్రమే కాదు.. రూబీ దేవి, ముఖేష్ ఇద్దరూ పెళ్లి కాకముందే ప్రేమించుకున్నారు. కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ల పెళ్లి కాలేదు. రూబీ దేవి.. నీరజ్ ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
Revenge Love story : 2022 లో ముఖేష్ కు పెళ్లి
2022 లో ముఖేష్ కు రుబీ అనే యువతితో పెళ్లి అయింది. అయినా కూడా ముఖేష్, రూబీ దేవి ఇద్దరూ కలుసుకునే వారు. ముఖేష్ కు పెళ్లి అవడం తట్టుకోలేని రూబీ దేవి.. ఏకంగా తన పిల్లలను తీసుకొని అతడితో లేచిపోయింది. దీంతో నీరజ్ గ్రామంలో తలెత్తుకోలేకపోయాడు. గ్రామ పెద్దలు ఎలాగోలా ముఖేష్ ను పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చారు.
దీంతో ముఖేష్, నీరజ్ మధ్య పెద్ద గొడవ అయింది. రూబీ దేవిని వదలనని.. తనను పెళ్లి చేసుకున్నానని.. ఇక నుంచి ఆమె తన భార్య అని ముఖేష్ నీరజ్ తో అన్నాడు. దీంతో చేసేదేం లేక నీరజ్.. రూబీ దేవి మీద ప్రేమను చంపుకున్నాడు. కానీ.. ముఖేష్ ఆ గ్రామంలో లేనందున.. అతడు పెళ్లి చేసుకున్న రుబీ ఒంటరిదైంది. అప్పుడప్పుడు నీరజ్.. రుబీని కలుస్తూ ఉండేవాడు.
తన ఫోన్ నెంబర్ తీసుకొని ముఖేష్ ఫోన్ చేస్తున్నాడా అని వాకబు చేసేవాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. తనకు ఏ సాయం కావలన్నా నీరజ్ చేసేవాడు. అలా వాళ్ల మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. గ్రామ పెద్దలకు ఈ విషయం చెప్పి గత నెలలోనే ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ విషయం స్థానికులకు తెలిసి ముక్కున వేలేసుకున్నారు. మొత్తానికి తన భార్య వెళ్లిపోయినా.. తనను అర్థం చేసుకునే మరో యువతి తన జీవితంలోకి రావడంతో నీరజ్ ఖుషీ అయ్యాడు. అలా.. ముఖేష్ కు భారీ షాక్ ఇచ్చి అతడి భార్యను పెళ్లి చేసుకొని నీరజ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.