»Jds Leader Hd Kumaraswamy Appeal To His Nephew Prajwal Revanna To Come Back
HD Kumaraswamy : ‘ఇండియాకు వచ్చి విచారణలో పాల్గొనండి’… ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ సీఎం విజ్ఞప్తి
కర్ణాటకలో సెక్స్ స్కాండల్ ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఈ ఘటన కలకలం రేపుతోంది. దీంతో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నారు.
HD Kumaraswamy : కర్ణాటకలో సెక్స్ స్కాండల్ ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఈ ఘటన కలకలం రేపుతోంది. దీంతో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి సోమవారం తన మేనల్లుడు ప్రజ్వల్ రేవణ్ణను దేశానికి తిరిగి రావాలని కోరారు. వచ్చి దర్యాప్తు సంస్థలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ దేశం నుంచి పారిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులతోపాటు దాదాపు 40 మంది మొబైల్ ఫోన్లను ట్యాప్ చేశారని, గూఢచర్యం చేశారని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.
కుమారస్వామి భారతదేశానికి తిరిగి వచ్చి విచారణకు సహకరించాలని ప్రజ్వల్ రేవణ్ణకు విజ్ఞప్తి చేశారు. ‘పోలీసులు, దొంగల ఆట ఇంకెంత కాలం కొనసాగుతుంది? మీరు రాజకీయంగా ముందుకు వెళ్లాలని మీ తాత ఎప్పుడూ కోరుకుంటున్నారని అన్నారు. మీరు అతని ప్రతిష్టను గౌరవించాలనుకుంటే, భారతదేశానికి తిరిగి రండి’ అని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కుమారస్వామి మాట్లాడుతూ.. నా చుట్టూ ఉన్న 40 మంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని నాకు తెలుసు. ఫోన్లో మా మధ్య ఏం జరిగినా మానిటర్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అతని కుటుంబంపై నిఘా పెట్టారు. అయితే కుమారస్వామి ఆరోపణలను నిరాధారమైనవని రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి డాక్టర్ జీ పరమేశ్వర కొట్టిపారేశారు.
రెండు రోజుల క్రితం మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మాట్లాడుతూ.. ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలితే ఆయనపై చర్యలు తీసుకోవడానికి అభ్యంతరం లేదని అన్నారు. ఈ విషయంలో హెచ్డి కుమారస్వామి ఆరోపణలపై ఇప్పటికే కుటుంబం తరపున, పార్టీ తరపున మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా ప్రభుత్వం అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరించడం చాలా ముఖ్యమన్నారు. అయితే హెచ్డీ రేవణ్ణపై పెట్టిన కేసులు కల్పితమని అన్నారు. వారిని టార్గెట్ చేసేందుకే ఇలా చేశారు. ఈ కేసులో చాలా మంది చిక్కుకున్నారు. ఇందులో భాగస్వాములైన వారందరినీ బాధ్యులుగా చేసి, బాధిత మహిళలందరికీ న్యాయం చేయాలని కోరారు.