Jayasudha: సినీ నటి, ప్రముఖ నేత జయసుధ (Jayasudha) ఈ రోజు బీజేపీలో చేరారు. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఇంచార్జీ తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జయసుధను తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి ఆహ్వానించారు. పార్టీలో చేరిన తర్వాత మాట్లాడే సమయంలో జయసుధ తడబడ్డారు.
భారతీయ జనతా పార్టీని.. భారత జనతా పార్టీ అని పలికారు. అలా రెండుసార్లు అనడంతో.. ఏంటీ ఈమె ఇలా మాట్లాడింది అని ప్రతీ ఒక్కరికీ సందేహాం వచ్చింది. చివరలో తాను ఓ వర్గానికి రిప్రెజెంట్ చేస్తున్నానని జయసుధ చెప్పారు. తాను క్రిస్టియన్ల కోసం పాటుపడతానని పేర్కొన్నారు. ఓ పొలిటిషీయన్ అయి ఉండి.. మతం పేరు చెప్పడం చర్చకు దారితీసింది. కులం, మతం లేని సమాజం కోసం కృషి చేస్తాం అంటారు. ఓ రాజకీయ వేదిక మీద జయసుధ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి.
మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని.. అందుకే బీజేపీలో చేరానని జయసుధ తెలిపారు. బీజేపీలో చేరే విషయం గత ఏడాది నుంచి చర్చలు జరిగాయని గుర్తుచేశారు. సేవా చేయాలని.. అభివృద్ధి చేసేందుకు బీజేపీలో చేరుతున్నానని వివరించారు. జయసుధ బీజేపీలో చేరిక తమకు బలాన్ని ఇస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అవినీతి పాలన.. నియంతృత్వ పాలన పోయేందుకు అందరం కలిసి పోరాడతాం అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే తమ లక్ష్యం అని కిషన్ రెడ్డి అంటున్నారు.