In Bihar, unable to bear the pain of challans, the bike was cremated and protested
Protested: దేశంలో కొన్నిసార్లు వింత నిరసనలు(Protested) చూస్తుంటాము. మాములుగా రాజకీయాల్లో ప్రతిపక్షాలకు ఏదైన సమస్య దొరికితే చాలు ఏదో రకంగా నిరసన ప్రదర్శనలు చేస్తారు. వర్షకాలంలో వీధుల్లో బురదలో వరినాట్లు వేస్తారు. గ్యాస్ ధర పెరిగిందని రోడ్లమీద వంటచేస్తారు. ఇలా చాలా రకాల నిరసనలు మనం చూశాము. అయితే బిహార్(Bihar) రాష్ట్రంలో ఓ సామాజిక కార్యకర్త బైక్ చలాన్ల(Bike challans) విషయమై కొత్త నిరసన చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టిట్ల తెగ చక్కర్లు కొడుతుంది.
రాష్ట్ర రాజధాని పట్నాలో పోలీసులు రోజుకు నాలుగుసార్లు చలాన్లు విధిస్తున్నారంటూ ఓ వ్యక్తి బైక్కు అంత్యక్రియల క్రతువు(funeral for a bike) నిర్వహించి వినూత్న నిరసన తెలిపాడు. అంత్యక్రియలకు సిద్ధం చేసినట్లుగా బైక్కు పూలమాలలు వేసి, చుట్టూ కర్రలను నిలబెట్టాడు. అయితే తన వాహనాన్ని కాకుండా పక్కన పేర్చిన కట్టెలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశాడు. సామాజిక కార్యకర్త కృష్ణకుమార్(Social worker Krishnakumar) అనే వ్యక్తి ఈ వినూత్న ప్రొటెస్టుకు శ్రీకారం చుట్టగా.. అతనితో పాటు అనేకమంది చలాన్ల బాధితులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరంలో పలుచోట్ల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుచేసి పదే పదే చలాన్లు విధిస్తున్నారని పేర్కొన్నారు. తమకు రోజుకు నాలుగు సార్లు చొప్పునా రూ. 4 వేలు జరిమానా వేశారని పలువురు వాపోయారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే బైక్కు అంత్యక్రియలు నిర్వహించామని అని కృష్ణకుమార్ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో సైతం చాలన్ల తీరుపై అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.