చాలా మంది సాహసోపేత క్రీడల్లో పాల్గొనేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. అలా పారాగ్లైడింగ్‌లో పాల్గొన్న ఓ హైదరాబాదీ వ్యక్తి ప్రాణాలు విడవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్‌కు చెందిన ఓ పర్యాటకుడు హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ(Kullu)ని సందర్శించడానికి వెళ్లాడు. అక్కడ పారాగ్లైడింగ్ చేయడానికి ఉపక్రమించిన సమయంలో ప్రమాదం జరిగింది. దీంతో అతడు మృతి చెందాడు. ఈ టూరిస్ట్ ఎవరన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం… పారాగ్లైడింగ్ పైలట్ టూరిస్ట్(tourist)కి సేఫ్టీ బెల్ట్‌ని పెట్టి సరిగ్గా చెక్ చేయకుండానే అతడిని వదిలివేశాడు. మానవ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు పైలెట్‌ని అరెస్ట్ చేసి మాజిస్ట్రియల్ ఎంక్వైరీకి పంపించారు. కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైన శర్మ ఈ ఘటనపై స్పందించారు. పారాగ్లైడింగ్ చేసిన ప్రదేశం, ఎక్విప్మెంట్కు అన్నింటికీ సరైన అనుమతులు ఉన్నాయన్నారు. పైలెట్‌కి సైతం రిజిస్ట్రేషన్ ఉందని వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో ఎలాంటి వాతావరణ సమస్యలూ లేవని చెప్పారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో పారాగ్లైడింగ్‌ని నిలిపివేసినట్లు తెలిపారు. విచారణ జరుగుతుందని చెప్పారు.