కర్ణాటక తమిళనాడు సరిహద్దులో ఘోర ప్రమాదం జరిగింది. అత్తిపల్లి(Attipalli)లోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీ(Factory)లో 20 మంది కార్మికులు ఉన్నారు. రెస్క్యూటీమ్ సహాయక చర్యలు చేపట్టారు.తమిళనాడులో అనుమతులు లేకుండా, అక్రమంగా బాణసంచా (fireworks) తయారు చేసే కేంద్రాలు చాలా ఉన్నాయి.
సరైన భద్రత ఏర్పాట్లు లేకుండానే, ప్రమాదకరమైన పరిస్థితుల్లో కార్మికులు వాటిలో పేలుడు పదార్ధాలతో బాణసంచాను తయారు చేస్తుంటారు.పేలుడు (Explosion) ధాటికి ఆ భవనం పై కప్పు ఎగిరిపోయింది. ఉవ్వెత్తున ఎగుస్తున్న మంటలను ఆర్పడానికి అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే ప్రయత్నాలు చేశారు. ఆ శిధిలాల నుంచి బయటకు తీసిన కార్మికులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు