»Hemanth Soren Supreme Court Rejected Former Cms Petition
Hemanth Soren: మాజీ సీఎం పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
భూకుంభకోణం కేసుకు సంబంధించి డైరక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మాజీ సీఎం హేమంత సోరెన్‌ను అరెస్ట్ చేస్తే.. తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
Hemanth Soren: భూకుంభకోణం కేసుకు సంబంధించి డైరక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మాజీ సీఎం హేమంత సోరెన్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో సోరెన్ తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని.. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సోరెన్‌ను కోరింది.
సోరెన్ మొదట జార్ఖండ్ హై కోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు ఉదయం దీనిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి తదితరులు వ్యూహం మార్చి, నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి వారు తెలిపారు. కుట్రలో భాగంగానే ఈడీ తనను అరెస్టు చేసిందని సోరెన్ తన పిటిషన్లో ఆరోపించారు. రాజీనామా సమర్పణకు రాజ్‌భవన్‌కు వెళ్తే అక్కడ అరెస్టు చేయడం అన్యాయమన్నారు.