పుస్తకాలు చదవాల్సిన విద్యార్థులు మారణాయుధాలను చేతబట్టారు. హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించగా భారీగా తుపాకులు, బాంబులు లభ్యం అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లోని ప్రయాగ్రాజ్ జిల్లా (Prayagraj District)లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లా బాయ్స్ హాస్టల్ (Boys Hostel)లో ఇద్దరు బాలుర మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ ఎక్కువ కావడంతో రంగంలోకి పోలీసులు దిగారు.
హాస్టల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా వారికి బాంబులు, పిస్టళ్లు లభించాయి. 30 లైవ్ బాంబుల (Bombs)ను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్ ఇక్చాల్ అనే విద్యార్థిపై అతని రూమ్ మేట్ జలాల్ అక్బర్ దాడి చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఆసిఫ్ తన హాస్టల్ నుంచి బయటపడి పోలీసులకు సమాచారం అందించాడు. హాస్టల్ లోని 57వ గదిలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ (police search Operation) చేపట్టారు.
పోలీసులకు మొత్తం రెండు పిల్టల్స్, 30 పేలుడు పదార్థాలు లభించాయి. ఈ ఘటనలో మొత్తం 12 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు (case File) చేసినట్లు తెలిపారు. కాగా యూపీలో ఈ మధ్యనే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు అయిన ఉమేశ్ పాల్ హత్య కేసులో కూడా ప్రధాన నిందితుడు రాజుపాల్ను ఇదే హాస్టల్లో పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.