కేరళ మాజీ ముఖ్యమంత్రి దివగంత నేత ఉమెన్ చాందీ (Umen Chandi) కుమార్తె అచ్చు ఉమెన్ పోలీసులను సైబర్ పోలీసులను ఆశ్రయించారు.అయితే తనపై సైబర్ దాడి (Cyber attack) జరుగుతోందంటూ తిరువనంతపురంకు చెందిన ఓ వ్యక్తి తన ఫేస్బుక్ ఖాతాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదులో ఆమె తెలిపింది. “నిందితుడు అచ్చు ఊమెన్ను పరువు తీయాలనే ఉద్దేశ్యంతో దురుద్దేశంతో ప్రజలకు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. అచ్చు ఊమెన్ సహా ఆమె దివంగత తండ్రి అవినీతిపరులంటూ అవాస్తవమైన, తప్పుడు, దూషణాత్మకమైన ఆరోపణలను వ్యాప్తి చేస్తున్నాడు” అని ఫిర్యాదు కాపీలో రాసుకొచ్చారు. కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న పుత్తుపల్లి అసెంబ్లీ స్థానానికి జరిగే ఎన్నిక కాంగ్రెస్ పార్టీ(Congress Party)తో పాటు ఊమెన్ చాందీ కుటుంబానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది.
కారణం.. ఆ స్థానం నుంచి ఊమెన్ చాందీ వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, ఆయన మరణానంతరం పుత్తుపల్లి అసెంబ్లీ (Puthupalli Assembly) స్థానానికి బై పోల్ జరుగుతున్నాయి. ఈ స్థానం నుంచి ఆయన కుమారుడు చాందీ ఊమెన్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి, ద్రవ్యోల్బణం వంటి సమస్యలనుంచి దృష్టి మరల్చేందుకు ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోలీసులు (Police) కేసు నమోదు చేసినట్టు సమాచారం.మరోవైపు, ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో అచ్చు ఊమెన్ సోదరుడు చాందీ ఊమెన్ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ (UDF) అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల వ్యక్తిగత జీవితం, వారి సమీపబంధువులు, ఆస్తులకు సంబంధించిన చర్చలు కొన్ని ఆన్లైన్ మీడియా గ్రూపుల్లో చర్చనీయాంశంగా మారాయి. అచ్చు ఊమెన్పై వేధింపులను సీపీఎం (CPM) అభ్యర్థి ఖండించారు. ఎవరినీ వ్యక్తిగతంగా దూషించడం, అవమానించడం మంచి పద్ధతి కాదన్నారు.