»For The First Time Women Lieutenants To Protect The Borders Of The Country
Artillery Regiment : దేశ సరిహద్దుల రక్షణకు తొలిసారి మహిళా లెఫ్టినెంట్స్ ..
చరిత్రలో తొలిసారిగా భారత సైన్యంలోని ఆర్టిలరీ రెజిమెంట్(Artillery Regiment)కు ఐదుగురు మహిళా అధికారులు నియమితులయ్యారు. అందులో తండ్రి కోరికపై ఒకరు.. భర్త ఆశయంతో మరొకరు.. ఆర్మీలో చేరామని చెబుతున్నారు.
దేశ చరిత్రలో ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి సైన్యం తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులు సరిహద్దు రక్షణకు ఎంపిక చేశారు. చెన్నై(Chennai) లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అడకామీ లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరారు. ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరిన మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్ మెహక్ సైనీ, లెఫ్టినెంట్ సాక్షి దూబే(Sakṣi dube), లెఫ్టినెంట్ అదితి యాదవ్, లెఫ్టినెంట్ పవిత్రా మౌద్గిల్ (Pavitra Moudgil) ఉన్నారని అధికారులు తెలిపారు. ఐదుగురు మహిళా అధికారుల్లో ముగ్గురిని చైనా సరిహద్దు వెంబడి మోహరించిన యూనిట్లలో, మిగతా ఇద్దరిని పాక్ సరిహద్దుకు సమీపంలో ‘సవాల్‌తో కూడుకున్న ప్రదేశాల్లో’ నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఆర్టిలరీ రెజిమెంట్‌లో మహిళా అధికారులను నియమించడం భారత సైన్యంలో వస్తున్న మార్పులకు నిదర్శనమని తెలిపాయి.
ఇదిలా ఉండగా.. జనవరిలో ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే (Manoj Pandey) ఆర్టిలరీ యూనిట్లలో మహిళా అధికారులను నియమించినట్లు జనవరిలో ప్రకటించారు. ఈ మేరకు సైన్యం ప్రతిపాదనలు కేంద్రానికి పంపగా.. ఆమోదం తెలిపింది. దాంతో తొలిసారిగా ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి ఐదుగురు మహిళా అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇదిలా ఉండగా.. చెన్నై(Chennai)లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో పాసింగ్ పరేడ్ జరిగింది. 189 క్యాడెట్స్ శిక్షణ పొందగా.. ఇందులో భూటాన్‌కు చెందిన 29 మంది క్యాడెట్స్ ఉన్నారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌ను బంగ్లాదేశ్ (Bangladesh) ఆర్మీ జనరల్ ఎస్ఎం షఫీయుద్దీన్ అహ్మద్ సమీక్షించి, క్యాడెట్స్‌ను అభినందించారు.ఆర్మీలో చేరాలని చిన్నప్పటి నుంచి నాన్న నన్ను ప్రేరేపించారు. మహిళా అభ్యర్థులకు ఆర్మీ అవకాశం ఇచ్చింది. సైన్యంలో చేరడం మిమ్మల్ని మీరు ఏంటనేది తెలుసుకోవడంలో ఆర్మీ సహాయపడుతుంది” అని లెఫ్టినెంట్ సాక్షి బుబే చెప్పారు.