»We Will Set Up A Statue Of Basaveshwar In Bhagyanagaram Minister Harish Rao 2
Hyderabad : భాగ్యనగరంలో బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేస్తాం : మంత్రి హరీశ్‌రావు
సమాజంలోని కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన గొప్ప అభ్యుదయ వాది బసవేశ్వర స్వామి అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) అన్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరం నడిబొడ్డున బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని కాశీపూర్‌లో బసవ భవన్ (Basava Bhawan) నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేశారు.మనిషికి పని విలువ తెలిపిన గొప్ప మహనీయుడు బసవేశ్వరుడు అని హరీశ్‌రావు (Harish Rao) అన్నారు.12వ శతాబ్దంలోనే కులరహిత సమాజం కోసం బసవేశ్వరుడు కృషి చేశాడని కొనియాడారు. బసవేశ్వరుడు దైవస్వరూపుడు అని అన్నారు. బసవేశ్వరుడి గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మాత్రం బసవేశ్వరుడి జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
లింగాయత్ సమాజం ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి సీఎం కేసీఆర్ (CM KCR) మాత్రమేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బసవేశ్వరుడి భవన్ కోసం కోకాపేట్లో రూ. 30 కోట్ల విలువైన భూమి ఇచ్చామని, దాని నిర్మాణం కోసం రూ. 10 కోట్లు కేటాయించామని తెలిపారు.సినిమా హీరో రజినీకాంత్ (Rajinikanth) కూడా సీఎం కేసీఆర్ పరిపాలనను మెచ్చుకున్నాడు. హైదరాబాద్ ఓ న్యూయార్క్(New York)లా కనిపిస్తుందని రజినీకాంత్ కొనియాడిన వ్యాఖ్యలను హరీశ్‌రావు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్జీ చైర్మన్ మంజు శ్రీ రెడ్డి, రాష్ట్ర చేనేత సహకార సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎరోళ్ళ శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.