DK Shivakumar:కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది. రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం కానుంది. దీంతో సీఎం అభ్యర్థిపై జోరుగా చర్చ జరుగుతుంది. మాజీ సీఎం సిద్ధ రామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ (DK Shivakumar) రేసులో ఉన్నారు. ట్రెండ్‌ను బట్టి మీడియా ముందుకు ఇద్దరు నేతలు వచ్చి.. మాట్లాడారు.
తమ పార్టీ విజయానికి కారణం కార్యకర్తలు, నేతలు అని డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో ప్రచారం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధరామయ్యకు కూడా థాంక్స్ తెలిపారు.
సీఎం రేసు గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీ మద్దతుదారులు సీఎం కావాలని కోరుకుంటున్నారని గుర్తుచేశారు. తనకు మద్దతు దారులు ఎవరూ లేరని.. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని తెలియజేశారు. సీఎం పదవీని హైకమాండ్ అందజేస్తోందని డీకే శివకుమార్ (DK Shivakumar) పేర్కొన్నారు.
2018లో కూడా ఆపరేషన్ లోటస్ పేరుతో బీజేపీ డ్రామాలు ఆడిందని సిద్ధరామయ్య (Siddaramaiah) విమర్శించారు. ఆ రోజున కూడా బీజేపీకి అధికారం దక్కలేదని చెప్పారు. దొడ్డిదారిలో అధికారం చేపట్టిందని పేర్కొన్నారు.