దేశ రాజధాని ఢిల్లీలో రాజ్యంగసంక్షోభం తలెత్తిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి హక్కులు లేవని అన్నారు.
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal) అన్నారు. అసెంబ్లీలో ఆయన సోమావారం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి అధికారం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తపరిచారు. హస్తినా అధికారాన్ని కేంద్రప్రభుత్వం అయిన బీజేపీ తన గుప్పిట్లలోకి తీసుకుందని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంపై వైపు నడిపించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుంది తప్ప కేంద్రంపై ఆధారపడాల్సిన అవసరం లేదని అన్నారు.
ఢిల్లీలోని ప్రభుత్వ అధికారులను బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తుందని, దానికి భయపడే నీటి బిల్లులను సరిచేసే వన్ టైమ్ సెటిల్మెంట్(one-time settlement) పథనాన్ని ముందుకు సాగనియడం లేదని అన్నారు. ప్రభుత్వ అధికారులపై కేంద్ర ఒత్తిడి తీసుకొస్తుందని ఆరోపించారు. క్లియరెన్స్ కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena)కు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం వల్ల 10.5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకురుతుందని ఆయన వెల్లడించారు.