»Circular Journey Ticket Railway Bumper Offer 56 Days Journey With One Ticket
Circular journey ticket: రైల్వే బంపర్ ఆఫర్..ఒక్క టికెట్‌తో 56 రోజుల జర్నీ
ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కొత్త కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. అందులో భాగంగానే ఈ సర్క్యూలర్ జర్నీ టికెట్. దీని ద్వారా 56 రోజులు దేశమంతటా ట్రైన్ జర్నీ చేయడానికి వీలు కల్పిస్తోంది. మరి దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Circular journey ticket, railway bumper offer.. 56 days journey with one ticket
Circular journey ticket: ప్రతి రోజు లక్షల్లో ప్రయాణించే అతిపెద్ద రావాణా సంస్థ ఏది అంటే రైలు ప్రయాణమని దాదాపు అందరికీ తెలుసు. ఇందుకు కారణం ఖర్చు తక్కువ, సురక్షితం. అయితే అనేక మంది ప్రజలు పుణ్య స్థలాలు, ఉద్యోగం, వ్యాపారం అంటూ నెలలో వందల మైళ్ల దూరం ప్రయాణిస్తుంటారు. అలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే (Indian Railways) ప్రత్యేకమైన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సర్క్యులర్ జర్నీ టికెట్ (Circular Journey Ticket). దీని ద్వారా అతి తక్కువ ఖర్చుతో చాలా దూరం ప్రయాణం చేయోచ్చని సంస్థ తెలిపింది. సాధారణంగా కొనుగోలు చేసే టికెట్లతో పోలిస్తే వీటిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ఈ సర్క్యులర్ జర్నీ టికెట్ల సాధారణ ప్రయాణ టికెట్ల ధర కంటే తక్కువగా ఉంటాయి. ప్రయాణానికి అనుకూలంగా ఏ క్లాసునైనా ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది. మీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన చోటు నుంచి తిరిగి అక్కడికి చేరుకునే వరకు తీసుకునే టికెట్టే ఈ సర్క్యూలర్ టికెట్. అయితే ఈ టికెట్‌తో ప్రయాణం చేయాలంటే ఒక షరతు ఉంది. అదేంటంటే గరిష్ఠంగా 8 బ్రేక్ జర్నీలు (Break Journey) మాత్రమే ఉంటాయి. ముందే ఎంపిక చేసుకున్న ఎనిమిది స్టేషన్లలో దిగవచ్చు. ఇలా గరిష్ఠంగా 56 రోజుల పాటు ఒకే టికెట్‌తో ప్రయాణం కొనసాగించొచ్చు. అంటే 56 రోజుల టికెట్ వ్యాలడిటీతో 8 స్టేషన్లనలో దిగి, ఎక్కవచ్చు అన్నమటా.
ఇది ఎలా తీసుకోవాలి
సర్క్యూలర్ టికెట్ల కోసం రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ని సంప్రదించాలి. మీ ప్రయాణ ప్రణాళిక ఆధారంగా టికెట్ ధరను లెక్కిస్తారు. అదే విషయాన్ని స్టేషన్ మేనేజర్‌కు తెలియజేస్తారు. అలా మీ ప్రయాణాన్ని ప్రారంభించే స్టేషన్ బుకింగ్ కార్యాలయంలో సర్క్యులర్ టికెట్ కొనుగోలు చేయవచ్చు. అలాగే మీరు ఏ ఏ స్టేషన్లలో దిగాలనుకుంటున్నారో ముందుగానే చెప్పి రిజర్వ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రేట్లను టికెట్ చెల్లు బాటు వ్యవధి, ప్రయాణ రోజులు, విరామ ప్రయాణ రోజులన్నింటిని పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు.
400 కిలోమీటర్ల దూరానికి ఒక రోజుగా, అలాగే ప్రయాణం చేయని రోజుల్లో 200 కిలోమీటర్లుగా ఒక రోజును లెక్కిస్తారు. అయితే ఈ సర్క్యులర్ టికెట్‌పై ప్రయాణికుడి సంతకం ఉండాలి. కనిష్ఠంగా 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సర్క్యులర్ జర్నీ టికెట్ల ధరపై సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇస్తారు. పురుషులకైతే 40 శాతం, మహిళలకైతే 50 శాతం రాయితీ ఉంటుంది. మాములుగా బుకింగ్ చేసుకునే టికెట్ల కన్నా సర్క్యూలర్ జర్నీ టికెట్ ధర ద్వారా బుకింగ్ చేసుకునే టికెట్ ధర చాలా చౌకగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ప్రయాణం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే ఈ టికెట్ బుక్ చేసుకోండి మరి.