»Vijay Devarakonda One Crore Distribution For 100 Families
Vijay Deverakonda: గొప్ప మనసు..ఫ్యాన్స్ ఫిదా!
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి చిత్రం మంచి ప్రజాదరణ పొందడంతో చిత్రబృందం ఆనందంతో పొంగిపోతోంది. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ కోటీ రూపాయలను 100 కుటుంబాలకు అందించనున్నట్లు ప్రకటించారు.
Vijay Devarakonda one crore distribution for 100 families
యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన ఖుషీ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలో విశాఖలో నిర్వహించిన సక్సెస్ మీట్లో విజయ్ కీలక విషయాన్ని పంచుకున్నారు. ఖుషిని పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈలోగా ఖుషి సినిమా సంపాదనలోంచి 1 కోటి రూపాయలను 100 కుంటాబాలకు అందజేసి అందరితో ఈ ఆనందాన్ని పంచుకుంటానని ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని 100 కుటుంబాలను ఎంపిక చేసి రానున్న రోజుల్లో ఒక్కొక్కరికి లక్ష చొప్పున విరాళంగా(donation) అందజేస్తానని దేవరకొండ అన్నారు. విజయ్ ఆన్లైన్ ఫారమ్‌ను క్రియేట్ చేస్తానని, దానిని తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేస్తానని చెప్పాడు. అవసరమైన వ్యక్తులు ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తమ బృందం డబ్బు అవసరమైన వారిని ఎంపిక చేసి వారికి అందజేస్తుందన్నారు. దానికి షేరింగ్ ఖుషీ దేవరకొండ ఫ్యామిలీ అని పేరు పెట్టాడు.
Just IN: Vijay Deverakonda to give ₹1 lac each to 100 families in the next 10 days.
ఈవెంట్ ప్రారంభంలో కోవిడ్ సంక్షోభ సమయంలో విజయ్ దేవరకొండ చేసిన సహాయానికి ప్రేక్షకుల నుంచి ఒక మహిళ ధన్యవాదాలు తెలిపింది. ఆ సమయంలో విజయ్ ఒక నిధిని ప్రారంభించి ఆ నిధి ద్వారా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేశాడు. ఇప్పుడు షేరింగ్ ఖుషీ(kushi)తో ఆయన చేస్తున్న దాతృత్వాన్ని పలువురు కొనియాడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా, శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.