ఈ మధ్యకాలంలో విడుదలై పాపులారిటీ తెచ్చుకున్న చిత్రం బేబి. ఈ చిత్రం అంచనాలేవీ లేకుండా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడు సాయి రాజేష్‌ను హైప్ లోకి తీసుకెళ్లింది. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఈ మూవీలో నటించారు. విరాజ్ అశ్విన్ ఇందులో కీలక పాత్ర పోషించారు.
“బేబీ” మూవీ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్లింది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం అపారమైన ప్రజాదరణ పొందడంతో పాటు, బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం “బేబీ” OTT ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది.
బేబితో అద్భుతమైన విజయాన్ని అందుకున్న దర్శకుడు సాయి రాజేష్ “బేబీ”కి సీక్వెల్ ఆలోచనలో ఉన్నాడు. ఇంతకుముందు పేరడీ సినిమాలు తీసిన సాయి రాజేష్ ఇప్పుడు “బేబీ”తో మంచి కీర్తి సంపాదించుకున్నాడు. ఇక భవిష్యత్తులో కూడా ఇదే జోనర్‌లోనే కొనసాగాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీక్వెల్ కథను ఒరిజినల్ నుండి కొనసాగిస్తారా? లేదా కొత్త కథతో ప్రయాణాన్ని ప్రారంభిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.