bus and tractor collision in ap anantapur district four people died
Accident in Chhattisgarh : రోడ్డు ప్రమాదాల్లో రోజూ ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డిస్టిలరీ సంస్థలో ఉద్యోగులు పని ముగించుకుని తిరిగి ఆఫీస్ బస్సులో ఇంటికి వెళుతున్నారు. అలా ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఛత్తీస్గఢ్(CHHATTISGARH), దుర్గ్ జిల్లా ఖాప్రి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే పదకొండు మంది ప్రాణాలు వదిలారు. ఆసుపత్రిలో మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. వారంతా స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ బస్సు ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ విషయమై ఛత్తీస్గఢ్(CHHATTISGARH) ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు సాధ్యమైనంత వరకు సహాయం చేస్తుందని చెప్పారు.