BJP's Stinging Reply To RJD's Coffin Comparison For New Parliament
New Parliament: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ (modi) చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ వేడుకకు కొన్ని పార్టీలు రాగా.. విపక్షాలు వ్యతిరేకించి బాయ్‌కాట్ చేశాయి. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కోరగా.. అందుకు బీజేపీ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
లాలు ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ కొత్త పార్లమెంట్ భవనంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ నూతన భవనం డిజైన్ శవపేటికతో పోల్చింది. ఈ మేరకు ఆ పార్టీ నేత శక్తి సింగ్ (shakti singh) ట్వీట్ చేశారు. అందులో పార్లమెంట్ భవనం, శవపేటిక కలిపి ఫోటోలను షేర్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టేస్తున్నారని చెప్పడమే తమ ఉద్దేశం అన్నారు. పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిదని పేర్కొన్నారు. చర్చల స్థానాన్ని ఇలా డిజైన్ చేశారని అడిగారు.
ఆర్జేడీ నేత శక్తి సింగ్ చేసిన ట్వీట్‌కు బీజేపీ అంతే గట్టిగా స్పందించింది.ఇదీ నిజంగా దురదృష్టకరం అని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ (sushil kumar modi) అన్నారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాన్ని ఇలా పోలుస్తారా..? అన్నీ పార్టీల నేతలు హాజరు కావాల్సింది అని చెప్పారు. ప్రారంభ కార్యక్రమాన్ని బాయ్ కాట్ (boycott) చేశారని.. పార్లమెంట్ సమావేశాలకు ఇక్కడికే రావాలి కదా అన్నారు. లేదంటే ఆ పార్టీ పార్లమెంట్‌కు రావడాన్నే బాయ్ కాట్ చేస్తోందా అని ప్రశ్నించారు. పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చినవారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని సుశీల్ కుమార్ మోడీ (sushil kumar modi) అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని అదే శవపేటికలో పాతిపెట్టడం ఖాయం అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ధ్వజమెత్తారు.