»Bjp Likely To Release Its 1st Lok Sabha Candidates List At 6 Pm Today Say Sources
BJP : ఈ రోజే బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఎన్నికల వ్యూహాలను శరవేగంగా అమలు చేస్తోంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
BJP : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఎన్నికల వ్యూహాలను శరవేగంగా అమలు చేస్తోంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ అధ్యక్షతన ఆ పార్టీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు లోక్సభ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. 100 మందితో నేడు తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణతో పాటు కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి ప్రముఖుల పేర్లు కూడా తొలి జాబితాలో ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ సహా బీజేపీ సభ్యులు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం రాత్రి సమావేశమైంది. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని అధికార పార్టీ చూస్తోంది. సీట్ల పంపకంపై భారత కూటమి ఇంకా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో, వారిపై మరింత ఒత్తిడి పెంచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.