నిప్పులేనిదే పొగ రాదంటారు. ఇండస్ట్రీలో పుట్టే పుకార్ల విషయంలో ఇదే మాట చెబుతుంటారు. కానీ కొన్నిసార్లు పుకార్లు నిజమవుతాయి.. ఇంకొన్ని సార్లు అది ఫేక్ అని ప్రూవ్ అవుతుంది. లేటెస్ట్గా ఓ యంగ్ బ్యూటీ చేసిన పని కాస్త షాకింగ్‌గానే ఉంది.
Mamita Baiju: మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది ‘ప్రేమలు’ అనే సినిమా. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా.. భారీ వసూళ్లను రాబడుతోంది. లవ్ కామెడీ డ్రామాగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి యూత్ గట్టిగా కనెక్ట్ అయింది. దీంతో.. ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్ కార్తికేయ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్‌కు కూడా రెడీ అవుతున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకి హైదరాబాద్ విజేత్ కాలేజీలో ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన యంగ్ బ్యూటీ మమితా బైజు చాలా ఫేమస్ అయింది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ బ్యూటీ చెప్పిన కొన్ని మాటలు వైరల్ అయ్యాయి. కోలీవుడ్ డైరెక్టర్ బాలా తనను కొట్టాడని.. దాంతో వనాంగన్ సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్నట్టుగా.. చెప్పినట్టు ఓ న్యూస్ వైరల్‌గా మారింది. కానీ ఇప్పుడు మాత్రం నేనలా చెప్పలేదని చెబుతోంది అమ్మడు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టుకొచ్చింది. ‘నేను ఒక తమిళ సినిమా గురించి మాట్లాడనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇందులో ఏ మాత్రం నిజంలేదు. నేను డైరెక్టర్ బాలా గురించి తప్పుగా మాట్లాడలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం దాదాపు ఒక సంవత్సరం పాటు బాలా సర్‌తో కలిసి పనిచేశాను. కానీ నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు.. ఇతర కమిట్మెంట్ల కారణంగా నేను ఆ చిత్రం నుండి తప్పుకున్నాను.. అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అసలు.. నిన్ను బాలా కొట్టాడా? లేదా? అప్పుడెందుకు అలా చెప్పావ్.. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నావని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.