Bihar : బీహార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు షాక్.. 65శాతం రిజర్వేషన్ల నిర్ణయం రద్దు
బీహార్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చింది. రిజర్వేషన్ కోటా పెంపు నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు రద్దు చేసింది. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం, కానీ బీహార్ ప్రభుత్వం రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది.
Bihar : బీహార్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చింది. రిజర్వేషన్ కోటా పెంపు నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు రద్దు చేసింది. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం, కానీ బీహార్ ప్రభుత్వం రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. దీన్ని ఇప్పుడు హైకోర్టు రద్దు చేసింది. SC, ST, EBC , ఇతర వెనుకబడిన తరగతులకు విద్యాసంస్థలు , ప్రభుత్వ ఉద్యోగాలలో 65 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 9, 2023న ఒక చట్టాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టం వల్ల రిజర్వ్డ్ ప్రజలకు 65 శాతం రిజర్వేషన్లు కల్పించగా, జనరల్ కేటగిరీ ప్రజలు 35 శాతానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత ఈ చట్టాన్ని కోర్టులో వారు సవాల్ చేశారు.
రిజర్వేషన్ల విషయంలో గౌరవ్ కుమార్తో సహా మరికొందరు పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్పై మార్చి 11న విచారణ అనంతరం నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. గౌరవ్ కుమార్ తదితర పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి కేవీ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈరోజు సుదీర్ఘ విచారణ జరిపింది. ఆ తర్వాత కోర్టు నిర్ణయం వెలువరించింది. కోర్టు 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది.
నవంబర్ 9, 2023న, బీహార్లోని నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం బీహార్లోని SC, ST, EBC, ఇతర వెనుకబడిన తరగతుల కోటాను 50 శాతం నుండి 65 శాతానికి పెంచింది. ఈ చట్టం ఆమోదంతో బీహార్ అత్యధిక రిజర్వేషన్లు కలిగిన రాష్ట్రంగా అవతరించింది. ఆ తర్వాత కేవలం 35 శాతం ఉద్యోగాలు జనరల్ కేటగిరీ ప్రజలకు ఇవ్వగా మిగిలిన 65 శాతం కోటా రిజర్వ్డ్ వ్యక్తుల ఖాతాలోకి వెళ్లింది.
కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ తరపు వాదనను వినిపించిన అడ్వకేట్ జనరల్ పీకే షాహి ఈ వర్గాలకు సమాన స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం లేదని అన్నారు. వెనుకబడిన వారు అభివృద్ధి చెందడానికి వారికి ఈ రిజర్వేషన్ కేటాయించారు. దీనిపై న్యాయవాది దిను కుమార్ స్పందిస్తూ జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కి 10 శాతం రిజర్వేషన్ను రద్దు చేయడం భారత రాజ్యాంగంలోని సెక్షన్ 14, సెక్షన్ 15(6)(బి)కి విరుద్ధమని గత విచారణలలో కోర్టుకు తెలిపారు. కులాల సర్వే అనంతరం కులాల దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్ నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిథ్యం కల్పించడం లేదని చెప్పారు. ఇందిరా స్వాహానీ కేసును ఉదహరిస్తూ న్యాయవాది దిను కుమార్ మాట్లాడుతూ ఇందిరా స్వాహానీ కేసులో రిజర్వేషన్ పరిమితిపై సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి విధించిందని అన్నారు.