మన ఇండియన్ కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ ఫోటో ఉంటుందని చిన్న పిల్లలకు కూడా తెలుసు. అయితే…. కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోతో పాటు గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలు పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal బుధవారం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
కరెన్సీలపై దేవుళ్ల ఫొటోలు పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు దేశ ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని ఆయన అన్నారు. రూపాయి విలువ నిరంతరం పడిపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో మరిన్ని పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించడం, దేశంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయని ఆయన అన్నారు.అయితే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సార్లు మంచి ఫలితం ఉండదని, దేవుళ్ల ఆశీస్సులు అవసరమని అన్నారు.