మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం భార్య అమృతా ఫడణవీస్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. పాములు, బల్లితో దిగిన ఫోటోలను షేర్ చేసిన డిప్యూటీ సీఎం భార్య ప్రమాదకరమైన విషపూరితమైన జంతువులు మనుషులు మాత్రమే’ అంటూ కామెంట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లలో ఒకరు మహారాష్ట్ర పాలిటిక్స్ ఇదే జరుగుతుందంటూ కామెంట్ పెట్టాడు. కాగా కొద్ది రోజుల క్రితం అమృతను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అనిల్ జై సింఘానీ(Anil Jai Singhani), ఆయన కుమార్తె అనిక్ష పై పోలీసులు కేసు నమోదు చేశారు.కొద్ది రోజుల క్రితం కూడా అమృత ఫడణవీస్ వార్తల్లో నిలిచారు.
అమృతను బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో క్రికెట్ బుకీ అనిల్ జై సింఘానీ, ఆయన కుమార్తె అనిక్ష (Aniksha Jaisinghani)పై పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి 20న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే 15 కేసుల్లో నిందితుడైన జైసింఘానీ(Jaisinghani) 7-8 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు మార్చిలో అతడిని అరెస్టు చేశారు. కాగా.. అనిల్ లొకేషన్‌ను గుర్తించేందుకు పోలీసులు అమృతా ఫడణవీస్ (Amrita Fadnavis) సాయం తీసుకున్నట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో తెలిపారు