»Vijay Varma On Tamannaah I Am Happy And Madly In Love With Her
Tamannaah: తమన్నాతో రొమాంటిక్ లైఫ్ పై విజయ్ కామెంట్స్..!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించిన మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె విజయ్ అనే నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. విజయ్ తో కలిసి ఆమె చాలాసార్లు మీడియాకు చిక్కింది. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో వారిద్దరూ లిప్ లాక్ చేసుకుంటున్న వీడియో కూడా బయటకు వచ్చింది.
ఇటీవల విజయ్ వర్మతో ఉన్న తన రిలేషన్ ని మిల్కీ బ్యూటీ తమన్నా కన్ఫామ్ చేశారు. తాను విజయ్ తో రిలేషన్ లో ఉన్నాను అని క్లారిటీ ఇవ్వడం విశేషం. తమకు లస్టో స్టోరీస్ 2 సెట్స్ లోనే పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమకు దారి తీసిందని తమన్నా చెప్పడం విశేషం. తాజాగా, తమన్నాపై ఉన్న ప్రేమను ఆమె ప్రియుడు విజయ్ బయటపెట్టడం విశేషం. తమన్నాతో తాను పీకల్లోతు ప్రేమలో ఉన్నామని, తనతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు.తన లైఫ్‌లో అడుగుపెట్టాక విలన్ దశ ముగిసిపోయిందని, రొమాంటిక్ దశ మొదలైందని తెలిపాడు. లస్ట్ స్టోరీస్-2 షూటింగ్ సందర్భంగా వీరిద్దరూ దగ్గరయ్యారు. విజయ్‌తో రిలేషన్‌షిప్‌పై తమన్నా కూడా స్పందించింది. “ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో సంతోషంగా ఉండగలమనే భావన కలగాలి. విజయ్‌తో నాకు అలాగే అనిపించింది.” అని తమన్నా వెల్లడించింది.