సార్వత్రిక ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల భేటీ కానుంది. కాంగ్రెస్ పార్టీ (Congress party) నేడు మరో కీలక భేటీకి సిద్ధమైంది. కేంద్రంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా నేడు, రేపు బెంగుళూరు(Bangalore)లో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల భేటీ జరగనుంది. చాలాకాలం తర్వాత సోనియా గాంధీ (Sonia Gandhi) కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మొత్తం 24 పార్టీలకు ఆహ్వానం పలికామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశంపై చర్చలు సాగనున్నాయి .గత నెలలో పాట్నా(Patna) లో సమావేశమైన తర్వత విపక్షాలకు ఇది రెండవ బేటీ
2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ (BJP) ని ఓడించడమే లక్ష్యంగా నేతలు ఈ భేటీలో చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీతో పాటు 15 కు పైగా విపక్ష పార్టీలు పాల్గొంటాయని తెలుస్తోంది. ఎన్సీపీ అధినేత శరత్ పవర్ (Sarath Power) ఈ భేటీకి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో పవార్ కుమార్తె, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియ సూలే ఈ భేటీకి హాజరవుతారని సమాచారం. ఈ భేటీలో తమ కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతోపాటు.. భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల్లో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) సహా విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీలో పాల్గొంటారు.
ఇక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) నేతలకు విందు ఏర్పాటు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై కొన్ని రోజులుగా పోరాటం చేస్తోన్న ఆప్.. తమకు పార్లమెంట్లో కాంగ్రెస్ మద్దతు తెలిపితేనే బెంగళూరు సమావేశానికి హాజరవుతామని గతంలో తేల్చి చెప్పింది.2024 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ లో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత ఆప్ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించింది. రాజ్యసభలో ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని కోరుతూ కేజ్రీవాల్ మమతా బెనర్జీ(Mamata Banerjee), ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్ లతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలతో వ్యక్తిగతంగా సమావేశమై విజ్ఞప్తి చేశారు.