యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ హరియాణా (Haryana) మహిళా రైతులతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జులై 8న హరియాణాలోని సోనేపట్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో మహిళా రైతులు డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఆ రైతులతోనే సోనియా గాంధీతో డ్యాన్స్(Sonia Gandhi dance) చేయడం గమనార్హం.
కాంగ్రెస్ నాయకులు షేర్ చేసిన సోనియా గాంధీ డ్యాన్స్ వీడియో:
Women farmers from Haryana had expressed their desire to @RahulGandhi to see Delhi and his house. He told them that the Govt has taken away his house.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) హరియాణాలో పర్యటించారు. ఆ సమయంలో రాహుల్ తో మహిళా రైతులు మాట్లాడుతూ తమ సమస్యలను చెప్పుకున్నారు. ఢిల్లీ నగరాన్ని, అలాగే అక్కడి రాహుల్ ఇంటిని చూడడానికి వస్తామని రాహుల్ ను ఆ మహిళా రైతులు కోరారు. దీంతో తనను లోక్సభకు అనర్హుడిగా పర్యటించాక ఢిల్లీలోని తన నివాసాన్ని ప్రభుత్వం తీసేసుకుందని ఆ రైతులకు రాహుల్(Rahul Gandhi) చెప్పాడు.
అయితే సోనియా గాంధీ(Sonia Gandhi) తమ ఇంటికి లంచ్ కు ఆ మహిళా రైతులను ఆహ్వానించారు. వారికి ప్రయాణ సౌకర్యాలను కూడా కల్పించారు. ఆ సందర్భంగా సోనియా గాంధీ ఆ మహిళా రైతులతో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోను కాంగ్రెస్ నేతలు షేర్ చేయగా అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.