దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు ఎక్కువవుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట వారిని అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా వారికి సరైన న్యాయం జరగడం లేదు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh), బీహార్ (Bihar) లాంటి రాష్ట్రాల్లో అయితే మహిళలపై హింస పెరిగిపోయింది. మహిళలపై పెరుగుతున్న దాడుల దృష్ట్యా అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ వారిపై దాడులు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఒంటరిగా వెళ్లే మహిళలకు ఆత్మరక్షణ కోసం కొన్ని సంస్థలు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి.
ఇప్పటి వరకూ కొందరు మాత్రమే పెప్పర్ స్ప్రే (Pepper spray) వినియోగిస్తున్నారు. అయితే వారు తమ రక్షణ కోసం ఓ సంస్థ ఓ అడుగు ముందుకేసింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ గన్(Gun)ను రెడీ చేసింది. ఉత్తరప్రదేశ్ కాన్ఫూర్(kanpur)లోని ప్రభుత్వ యాజమాన్య సంస్థ అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ రివాల్వర్‌ను సిద్ధం చేసింది. ఆ గన్‌కు ప్రబల్ (Prabal Revolver)గా పేరుపెట్టింది. భారత్‌లో ఇదొక లాంగ్ రేంజ్ రివాల్వర్ (Revolver) కావడం విశేషం.
ఈ ప్రత్యేక గన్ను ఆగస్టు 18వ తేదిన విడుదల చేయనున్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఈ ప్రత్యేక గన్ తయారీకి ప్రత్యేక ప్రణాళిక వేస్తోంది. ఏడాదిలో కేంద్ర నుంచి దీనికి రూ.6 వేల కోట్ల ఆర్డర్లు ఇస్తోంది. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి రూ.450 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. ఈ ప్రత్యేక గన్ను మహిళలు సులభంగా ఉపయోగించొచ్చు. దీనిని బరువు 700 గ్రాములు ఉంటుంది. ఈ గన్ 76 మిల్లీమీటర్ల సైజులో ఉండగా ఈ రివాల్వర్ రేంజ్ 20 మీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే కొత్త వర్షన్ రివాల్వర్ (Revolver) రేంజ్ 50 మీటర్ల వరకూ ఉంటుంది. త్వరలోనే ఈ ప్రత్యేక గన్ అందరికీ అందుబాటులోకి రానుంది.