»2 5 Crores Found In Washing Machine Enforcement Directorate Seizes Money
ED : వాషింగ్ మిషన్‌లో నోట్ల కట్టలు.. ఈడీ సీజ్
విదేశాలకు నగదును అక్రమంగా ట్రాన్సవర్ చేస్తున్న కంపెనీలపై ఈడీ తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలో వాషింగ్ మెషీన్లో దాచిపెట్టిన 2.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Enforcement Directorate: ఫెమా చట్టాలను ఉల్లంఘిస్తూ విదేశాలకు అక్రమంగా డబ్బుల్ని పంపించేస్తున్న కొన్ని కంపెనీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) తనిఖీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఓ దగ్గర వాషింగ్ మిషన్‌లో(Washing Machine) దాచి పెట్టిన 2.5 కోట్ల నోట్ల కట్టల్ని స్వాధీనం చేసుకుంది. అయితే ఈ డబ్బులను ఏ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నారన్న విషయాన్ని మాత్రం ఈడీ(ED) వెల్లడించలేదు.
ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కురక్షేత్ర, హరియానాల్లో ఈడీ ఈ సోదాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఈడీ ఇలా వాషింగ్ మిషన్‌లో ఉన్న కట్టల కట్టల డబ్బులకు సంబంధించిన ఫోటోను విడుదల చేసింది. అయితే ఇంత భారీ సొమ్మును ఎక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నదీ వెల్లడించలేదు. సింగపూర్‌కు చెందిన గెలాక్సీ షిప్పింగ్ కంపెనీకి సుమారు 1800 కోట్లను కాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీ తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షెల్ కంపెనీల ద్వారా భారీ మొత్తం లావాదేవీలు జరిగినట్లు భావిస్తున్నారు. దీంతో 47 బ్యాంకు ఎకౌంట్లను సైతం ఫ్రీజ్ చేసినట్లు ఈడీ చెబుతోంది.