గుజరాత్(gujarat) లోని మోర్బీ బ్రిడ్జ్(Morbi bridge) కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 140మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా… ఈ ప్రమాదంలో… బీజేపీ(bjp)ఎంపీ కి చెందిన కుటుంబసభ్యులు దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాజ్ కోట్ బీజేపీ ఎంపీ మోహన్ కుందారియా కుటుంబ సభ్యులు 12 మంది వంతెన కూలిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం గమనార్హం. చనిపోయిన వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. వీరంతా తన సోదరి కుటుంబానికి చెందిన వారని ఎంపీ వివరించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని ఎంపీ తెలిపారు.