టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘SK-30’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు ఉదయం 10:14 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘రెడీ అయిపోండి తమ్ముళ్లూ.. రేపు సౌండ్ అదిరిపోద్ది’ అంటూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాను AK ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.