పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’, ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాల్లో నటి నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా దీనిపై నిధి ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొన్నట్లు తెలిపింది. ‘ఒక సినిమా షూటింగ్ ఆంధ్రాలో, మరొకటిది తెలంగాణలో జరుగుతోంది. ఈ రెండు సినిమాల్లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ మూవీలు ప్రేక్షకుల్లో పండుగ వాతావరణం నింపుతాయి’ అంటూ రాసుకొచ్చింది.