బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్‌ను బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న శత్రుత్వం ఆగిపోవాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ముంబై పోలీసులకు ఓ ఆగంతకుడు వాట్సాప్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒకవేళ ఆ మొత్తాన్ని సల్మాన్ చెల్లించకపోతే మాజీ MLA సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.