రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన ఆరోపణలు చేశారు. రష్యా తరపున ఉత్తర కొరియాకు చెందిన 10 వేల మంది సైనికులు ఉక్రెయిన్పై యుద్ధంలో పాల్గొనబోతున్నారని తెలిపారు. దీనిపై తమకు నిఘా సమాచారం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం వారంతా స్వదేశంలో శిక్షణ పొందుతున్నారని ఆరోపించారు.