AP: నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరం నెలకొంది. ఆళ్లగడ్డ వదిలి వెళ్లాలంటూ ఏవీ సుబ్బారెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. దీనిపై స్పందిస్తూ.. ఏం జరిగినా ఆళ్లగడ్డలోనే తేల్చుకుంటానంటూ కౌంటర్ ఇచ్చారు. ఇరు వర్గాల నేతల మాటల యుద్ధం నేపథ్యంలో ఆళ్లగడ్డలో భారీగా పోలీసులు మోహరించారు.