AP: పరువు నష్టం దావా కేసులో ఇవాళ విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు. సాక్షి మీడియాపై రూ.75కోట్లకు లోకేశ్ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం లోకేశ్ కోర్టుకు వెళ్లనున్నారు. తమ పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారని లోకేశ్ అన్నారు. తప్పుడు కథనాలు రాసిన పత్రికపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.