సీనియర్ నటి రమాప్రభ ఇంట విషాదం నెలకొంది. ఆమె సోదరి తనయుడు సురేష్ కన్నుమూశాడు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గత కొన్ని నెలలుగా సురేష్.. కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా, రమాప్రభ సమర్పణలో తెరకెక్కిన ‘అప్పుల అప్పారావు’ వంటి సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించాడు.