AP: ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన సూపర్-6 హామీల్లో మరో రెండు పథకాల అమలుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. దీని ద్వారా స్కూల్స్, జూనియర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ రూ.15వేల చొప్పున ఇవ్వనుంది. రైతులకు ఏటా రూ.20వేల చొప్పున లబ్ధి చేకూర్చే ‘అన్నదాత సుఖీభవ’ కింద నిధులను మార్చి-ఏప్రిల్ మధ్య అందించనుంది.