బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 46 పరుగులకే కుప్పకూలడంపై విమర్శల వర్షం కురుస్తోంది. నెలరోజుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఉండటంతో జట్టుకు ఇది ముందస్తు హెచ్చరిక అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. పేసర్లను ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికైనా నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. బ్యాటర్ల తీరు మారకుంటే పరాయి గడ్డపై మరోసారి ఘోర పరాభవం ఎదురవడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.