కామారెడ్డి: అండర్- 14, 17 బాలికలకు, బాలురకు ZPHS చిన్నమల్లారెడ్డి పాఠశాలలో శుక్రవారం ఉదయం 9:30 గంటల నుంచి జోనల్ స్థాయి వాలీబాల్ పోటీల ఎంపికలు ఉంటాయని పిడి దయాకర్ రెడ్డి తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి ఆరుగురిని (టీమ్)ను ఎంపిక చేస్తామని చెప్పారు. విద్యార్థులు తప్పనిసరిగా బోనఫైడ్ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు.