TG: మాజీమంత్రి హరీశ్‌రావు బంధువులపై కేసు నమోదైంది. హరీశ్‌రావు బంధువులు తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజ్ కుమార్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి సహా తన్నీరు పద్మజారావుపై కేసు వేశారు. మియాపూర్ పోలీసులు వారిపై ట్రెస్పాస్, చీటింగ్ కేసును నమోదు చేశారు. ఐదు అంతస్తుల భవనంలో అక్రమంగా వచ్చి ఉంటున్నారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి వారిపై ఫిర్యాదు చేశారు.