BDK: గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 25 వరకు భద్రాచలం ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో పాటు డెమో ఆధారంగా ఎంపికలు ఉంటాయని వెల్లడించారు.