హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ మృతిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ధైర్యవంతులైన ఇజ్రాయెల్ సైన్యం సిన్వర్‌ను రఫాలో హతమార్చారని వెల్లడించారు. దీంతో గాజాలో యుద్ధం అంతం కాలేదని, ఇప్పుడే ముగింపు దశ ప్రారంభమైందని తెలిపారు. హమాస్ సభ్యులంతా లొంగిపోయి వారి దగ్గరనున్న బందీలను విడిచిపెడితే గాజాతో యుద్ధానికి స్వస్తి పలుకుతామని, బందీలుగా ఉన్న తమ పౌరులు తిరిగి వచ్చేవరకు పోరాడతామని తేల్చి చెప్పారు.