ప్రొ.కబడ్డీ లీగ్(PKL) సీజన్ 11కు ఇవాళ తెరలేవనుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు ఈ టోర్నీ ప్రారంభంకానుంది. తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మ్యాచ్‌తో లీగ్ మొదలవనుంది. మొత్తం 12 జట్లు బరిలో ఉండగా.. డిసెంబర్ 24 వరకు సాగే లీగ్ దశలో 132 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. కాగా, నవంబర్ 9 వరకు ఇక్కడే పోటీలు జరగనున్నాయి.