బిగ్ బాస్(BigBoss) ఫేమ్ మిత్రా శర్మ(Mitra Sharma) ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో హర్ష సాయి(Harsha Sai) హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేయనున్నట్లు సమాచారం.
యూట్యూబర్ హర్ష సాయి(Youtuber Harsha Sai) గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. తన వీడియోలతో యూట్యూబ్‌లో హర్షసాయి ఓ సంచలనం సృష్టించాడు. పేదవారిని గుర్తించి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. సమాజ సేవ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును హర్ష సాయి(Harsha Sai) తెచ్చుకున్నారు. హర్షసాయికి యూట్యూబ్ లో 8.64 మిలియన్ల ఫాలోవర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
సోషల్ మీడియాలో ఇతర ఫ్లాట్ ఫామ్స్‌లో హర్షసాయి(Harsha Sai) ఫాలోవర్స్ 10 మిలియన్ల మందికిపైనే ఉన్నారు. హర్షసాయి రాజకీయాల్లోకి వస్తాడని, లేదంటే సినిమాల్లోకి వస్తాడని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. హర్షసాయి టాలీవుడ్(Tollywood) హీరో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్(BigBoss) ఫేమ్ మిత్రా శర్మ(Mitra Sharma) ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో హర్ష సాయి(Harsha Sai) హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేయనున్నట్లు సమాచారం. హర్షసాయి గతంలో కూడా హీరోగా నటిస్తాడంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని నిజం చేస్తూ హీరోగా హర్ష సాయి అరంగేట్రం చేయబోతున్నాడు. మిత్రా శర్మ నిర్మాణంలో హర్షసాయి చేయబోతున్న ఈ సినిమా గురించి త్వరలోనే అనౌన్స్మెంట్ రానుంది.