ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య సెట్స్ పై ఉన్నప్పుడే గాడ్ ఫాదర్, మెగా 154, భోళా శంకర్ సినిమాలను మొదలు పెట్టారు. ఈ దసరా కానుకగా గాడ్ ఫాదర్ రిలీజ్ కానుంది. ఇక సంక్రాంతి గిఫ్ట్‌గా మాసివ్ మెగా 154 ప్రాజెక్ట్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ పరిశీనలో ఉన్న ఈ సినిమాను దర్శకుడు బాబి పక్కా మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. దాంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఇందులో మాస్ మహారాజా కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే రవితేజ మెగా 154 షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఇకపోతే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వెంకీకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున సైతం ఇందులో కనిపించనున్నాడని తెలుస్తోంది. చిరు కోసం గెస్ట్ రోల్ చేసేందుకు నాగ్ ఓకే చెప్పాడని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ సీనియర్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు మురిసిపోవడం ఖాయం. చిరు, నాగ్, వెంకీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. దాంతో వాల్తేరు వీరయ్యకు ఊహంకందని హైప్ రావడం పక్కా. పైగా సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు కాబట్టి.. అభిమానులు ఇదే అతి పెద్ద పండగ అని చెప్పొచ్చు. మరి ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.